చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీకి నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. మృగశిర కార్తె(Mrugashira Karthai) ప్రవేశం సందర్భంగా అస్తమా(Asthma) వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు రేపు చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వంలోని వివిధశాఖల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీకి నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. మృగశిర కార్తె(Mrugashira Karthai) ప్రవేశం సందర్భంగా అస్తమా(Asthma) వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు రేపు చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వంలోని వివిధశాఖల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Srinivas Yadav) ఏర్పాట్ల విషయంల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించనున్నారు.

ఈ సారి చేప ప్రసాదం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏర్పాట్ల విషయంలో వివిధ ప్రభుత్వశా‎ఖలను సమన్వయపరుస్తూనే పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‎కు అప్పగించింది. చేపమందు పంపిణీకి ఆర్‌ అండ్‌ బీ అధికారులు షెడ్స్‌, ఫ్లడ్‌ లైట్లు, భారీకేడ్లు ఏర్పాటు చేయగా..ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్‌, మరుగుదొడ్లను ఏర్పాటు చేయగా..జలమండలి అధికారులు మంచినీటిని అందుబాటులో ఉంచారు. మొత్తానికి సమాచారశాఖతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అస్తమ బాధితులు వారి సహాయకులతో కలిసి ఒకరోజు ముందే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానికి చేరుకున్నారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బారీకేడ్లలో వారు సేద తీరుతున్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 8 నుంచి 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు 80 బస్సులు ఏర్పాటు చేశారు.

ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఈ రోజు (గురువారం) సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అస్తమ బాధితులు రానుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రాఫిక్‌ రద్దీని బట్టి, ట్రాఫిక్‌ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అదనపు సీపీ సుధీర్ బాబు సూచించారు.

Updated On 8 Jun 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story