తెలుగు రాష్ట్రాలలో(Telugu states) నిత్యావసర(essentials) వస్తువుల ధరలు(Price) అమాంతం పెరిగాయి.
తెలుగు రాష్ట్రాలలో(Telugu states) నిత్యావసర(essentials) వస్తువుల ధరలు(Price) అమాంతం పెరిగాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కాస్త ముందుంది. పండుగల వేళ ధరలు ఇలా పెరిగిపోవడంతో సామాన్యుడు తల్లడిల్లుతున్నాడు. అయిదారు నెలల కిందట ధరలతో పోలిస్తే ఇప్పుడు కనీసం 30 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. నాలుగు నెల కిందట కిలో టమాట 28 రూపాయలకు వచ్చేది. ఇప్పుడది వంద రూపాయలు దాటింది. కిలో పాతిక రూపాయలు ఉన్న ఉల్లి ప్రస్తుతం 80 రూపాయలు అయ్యింది. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయల ధరలన్నీ కిలో 70 రూపాయలపైనే ఉన్నాయి. పది రూపాయలకు దొరికే కొత్తమీర కట్ట ఇప్పుడు 50 రూపాయలయ్యింది. ఆకు కూరల ధరలు కూడా నాలుగు రెట్లు పెరిగాయి. అయిదు నెలల కిందట 200 రూపాయలకు బ్యాగ్ నిండే కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా నిండటం లేదు. వంట నూనెల ధరలు కూడా సలసల కాగుతున్నాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగిపోయాయి. మే నెలలో కిలో రూ.166 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.121 నుంచి రూ.139కి పెరిగింది. బియ్యం ధరలు కూడా పెరిగాయి.