ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి 1956-57 ఆర్థిక సంవత్సరం నుండి 2013-14 ఆర్ధిక సంవత్సరం వరకు చేసిన వ్యయం 4,98,053 కోట్లరూపాయలు. ఈ నిధులతో, ఔటర్ రింగ్ రోడ్ మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్, జూరాల, కోయిలసాగ దేవాదుల, శ్రీరామ్ సాగర్ మరియు కడెం వంటి కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులతో సహా తెలంగాణలో అనేక కీలక ఆస్తులు అభివృద్ధి చెందాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి 1956-57 ఆర్థిక సంవత్సరం నుండి 2013-14 ఆర్ధిక సంవత్సరం వరకు చేసిన వ్యయం 4,98,053 కోట్లరూపాయలు. ఈ నిధులతో, ఔటర్ రింగ్ రోడ్ మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(International Airport) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్, జూరాల, కోయిలసాగ దేవాదుల, శ్రీరామ్ సాగర్ మరియు కడెం వంటి కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులతో సహా తెలంగాణలో అనేక కీలక ఆస్తులు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మంజీర, కృష్ణా మరియు గోదావరి నదుల నుండి వివిధ దశలలో (పేజ్ , పేజ్ | మరియు పేజ్ III) బహుళ తాగునీటి కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. అదనంగా, IIIT వంటి ముఖ్యమైన విద్యాసంస్థలు, వివిధ జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు మరియు NIMS, RIMS, గాంధీ హాస్పిటల్, MGM మరియు KMC వంటి ఆసుపత్రులు వెలిశాయి. అదనంగా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటానికి రోడ్లు, భవనాలు, కాలువలూ లైన్లు వంటి విస్తృతమైన మౌలిక సదుపాయాల కల్పన జరిగింది.
ఇంకా, DRDO, NFC, మిధాని, DRDL మరియు BDL వంటి కేంద్రసంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. ఇదే సమయంలో BHEL, ECIL, CPRI మరియు IDPL వంటి అనే సంస్థలు స్థాపితమయ్యాయి. ముఖ్యంగా, IDPL ఔషధ పరిశ్రమలకు, మరియు ఉత్ప్ర్పేరకంగా కీలక పాత్ర పోషించింది. రెడ్డి ల్యాబ్స్, GSK, వై బయోటెక్, హెటెరో మరియు అరబిందో వంటి ఫార్మాస్యూటికల్ మరియ కంపెనీలకు హైదరాబాద్, ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించడంలో దోహదపడింది. CCMB, HCU, IICT, NGRI, ICRISAT, NARM, NIN, EFLU మరియు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలను నిర్వహిస్తూ, హైదరాబాద్ కూడా ఒక ముఖ్యమైన పరిశోధనా కేంద్రంగా స్థిరపడింది. ఇంకా, NPA, NISA, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్, NISIET మరియు ఇతర అనేక భారత ప్రభుత్వ శిక్షణా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం ద్వారా స్థాపించబడినప్పటికీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు భూమి, ఇతర అవసరమైన సౌకర్యాలు మరియు తగిన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వాటి స్థాపన మరియు వృద్ధికి గణనీయంగా తోడ్పాటును అందించింది ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. పైన పేర్కొనబడిన ఆస్తులన్నీ పొదుపుగా, ఆర్ధికంగా వివేకంతో ఏర్పాటయ్యాయి. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన పదహారు మంది ముఖ్యమంత్రుల కాలంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఉన్న అప్పు కేవలం 72,658 కోట్ల రూపాయలు మాత్రమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణం 3,89,673 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన SPVల రుణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, వాస్తవ రుణం 5,16,881 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంకా, ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలను కూడా కలుపుకుంటే, మొత్తం రుణభారం 6,12,343 కోట్ల రూపాయలకు చేరుతుంది. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 14,87,834 కోట్ల రూపాయలు, చేసిన అప్పులు 6,12,343 కోట్ల రూపాయలు. అంటే కేసీఆర్‌ కుటుంబం చేసిన ఆర్ధిక ఆరాచకం విలువ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు. 50 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 4,98,053 కోట్ల రూపాయలబడ్జెట్ , 75 వేల కోట్ల రూపాయలు అప్పులు. మొత్తం 5,70,000 కోట్ల రూపాయలు. ఈ సొమ్ముతోనే అన్ని ప్రాజెక్టులు కడితే మరి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలకు ఎన్ని కట్టి ఉండాలి? ప్రాజెక్టులు లేవు, ప్రభుత్వం ఖాతాలలో డబ్బులు లేవు . ఏమయ్యాయో చెబుతారా?

Updated On 25 Dec 2023 8:16 AM GMT
Ehatv

Ehatv

Next Story