హైదరాబాద్‌లో(Hyderabad) దారుణం చోటు చేసుకుంది. రెండో భార్య(Second Wife) ఉరి వేసుకుంటుంటే సెల్‌ ఫోన్‌లో రికార్డ్(Video record) చేసి ఆమె సోదరుడికి పంపించాడు. మద్యానికి బానిసగా(Alcohol Addiction) మారిన ఈ ఉన్మాదిని మద్యం మానేయాలని రెండో భార్య బతిమలాడేది. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పైగా రోజూ తాగి వచ్చి ఆమెను చిత్ర హింసలు పెట్టేవాడు. తాగడం(Drinking) మానేయకుంటే ఉరి వేసుకోబోతున్న తన రెండో భార్యను భర్త ఆపలేదు.. పైగా ఆమె ఉరివేసుకుంటుంటే పైశాచిక ఆనందం పొందుతూ తన మొబైల్‌లో వీడియో తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆసీఫ్‌నగర్‌లో(Asif Nagar) ఉండే షేక్‌ రసూల్‌కు(Shaik Rasool) ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఉన్నా కానీ మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు సంతానం. రెండో భార్యకు ఇద్దరు సంతానం. కార్పెంటర్‌గా(Carpenter) పనిచేసే రకుల్.. మద్యానికి బానిసగా మారాడు. మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండో భార్య అర్షాబేగం ఇతడిని మార్చాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. మద్యం మానేయాలని రోజూ బతిమలాడుకునేది. తాగుడు మానకపోగా ఇంకా ఎక్కువ తాగుతూ ఆమెను చిత్రహింసల పాలు చేశాడు రసూల్. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె, పిల్లలు పలు సందర్భాల్లో పస్తులుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 11న తాగి వచ్చిన భర్తను మరోసారి హర్ష(Harsha Begum) నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇతడు పెట్టే హింసను భరించలేని అర్షాబేగం నేను చనిపోతానని బెదిరించింది. ఆమె వ్యాఖ్యలకు వెటకారంగా కౌంటర్ ఇచ్చాడు.. నేను చావును ఎప్పుడూ చూడలేదు.. నువ్వు చనిపోతుంటే చూస్తానంటూ అవహేళన చేశాడు. నువ్వు చస్తే నా మొదటి భార్య దగ్గరికి వెళ్తానన్నాడు. దీంతో మనస్తాపం చెందిన అర్షాబేగం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటనను ఉన్మాది తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సిందిపోయి దారుణంగా ప్రవర్తించాడు. వెకిలిగా నవ్వుకుంటూ వీడియో తీసి దానిని ఆమె సోదరుడికి పంపించాడు. అంతేకాకుండా మీ చెల్లి చనిపోయిందంటూ వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని చెప్పాడు. పిల్లలు రోదిస్తున్నా ఈ ఉన్మాది కనికరించలేదు. స్థానికులు 100కు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రసూల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 14 Dec 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story