ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్(Congress) నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రధాన అనుచరుడు ఆకుల మూర్తి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్(KTR) ను కలిసిన ఆకుల మూర్తి(Akula Murthi).. నా పయనం బీఆర్ఎస్(BRS) తోటేనని స్పష్టం చేశారు. కేటీఆర్ పై పొంగులేటి(Ponguleti) చేసిన వ్యాఖ్యలు మాకు నచ్చలేదని అన్నారు.
ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్(Congress) నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రధాన అనుచరుడు ఆకుల మూర్తి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్(KTR) ను కలిసిన ఆకుల మూర్తి(Akula Murthi).. నా పయనం బీఆర్ఎస్(BRS) తోటేనని స్పష్టం చేశారు. కేటీఆర్ పై పొంగులేటి(Ponguleti) చేసిన వ్యాఖ్యలు మాకు నచ్చలేదని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తానన్నారు.
ఇటీవల రాహుల్(Rahul) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం సభ సక్సెస్‌తోనూ పార్టీ పుల్ జోష్‌లో ఉంది. దీంతో రెండు రోజుల క్రితమే పొంగులేటికి అధిష్టానం టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం తొలిసారి గాంధీ భవన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. అయితే.. బీఆర్ఎస్‌ను ఖచ్చితంగా గద్దె దింపుతామని అంటున్న పొంగులేటికి.. ఆకుల మూర్తి షాక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై పొంగులేటి స్పందించాల్సివుంది.