తెలంగాణలో సమాజ్‌వాదీ పార్టీని(Samajwadi Party) పటిష్టపరచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి(S. Simhadri) లక్నోలో ఎస్పీ కేంద్ర కార్యాలయంలో అఖిలేష్‌ను కలుసుకున్నారు. ఉభయులు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో సమాజ్‌వాదీ పార్టీని(Samajwadi Party) పటిష్టపరచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి(S. Simhadri) లక్నోలో ఎస్పీ కేంద్ర కార్యాలయంలో అఖిలేష్‌ను కలుసుకున్నారు. ఉభయులు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో బీసీలకు నాయకత్వం వహించే పార్టీ, బీసీల అభివృద్ధికి పాటుపడే పార్టీ సమాజ్‌వాదీ పార్టీనేనని ఈ సందర్భంగా అఖిలేష్ చెప్పారు. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఎస్పీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దానికి తెలంగాణ పార్టీ క్యాడర్ అంతా కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కార్యకర్తలంతా చురుకుగా పని చేయాలని అఖిలేష్ అన్నారు. అధికారమే లక్ష్యంగా తామంతా పని చేస్తామని తెలంగాణ పార్టీ శ్రేణులు అధినేతకు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ములాయంసింగ్ యాదవ్, బీపీ మండల్(BP Mandal) విగ్రహాల ఆవిష్కరణలో అఖిలేష్ పాల్గొంటారని సింహాద్రి తెలిపారు. పీడీఏ అజెండాను గ్రామగ్రామాన ప్రచారం చేస్తారని చెప్పారు. వెనుకబడిన వర్గాలను, దళిత, గిరిజన మరియు అల్పసంఖ్యాకులను చైతన్య పరచాలని అవసరాన్ని అఖిలేష్ గుర్తించారని అన్నారు. ఓబీసీలకు, దళితులకు, మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతున్నదని, బీజేపీ విముక్త భారత్ కోసం అందరూ పాటుపడాలని సింహాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.