హైదరాబాద్‌లోని(Hyderabad) ఎల్లారెడ్డిగూడలో(Ellareddyguda) నివాసం ఉండే అఖిల్(Akhil) అనే 21 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్‌కు(PubG) బానిసయ్యాడు. పబ్జీకి బానిసలా మారి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. అఖిల్ అమీర్‌పేట(Ameerpet) సిద్ధార్థ కాలేజ్‌లో(Siddhartha College) బీకాం(B.Com) సెకండియర్‌ చదువుతున్నాడు. గత కొంత కాలంగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదు. పబ్జీకి బానిసలాగా మారి మనిషి మనిషిలా లేడు.

హైదరాబాద్‌లోని(Hyderabad) ఎల్లారెడ్డిగూడలో(yellareddyguda) నివాసం ఉండే అఖిల్(Akhil) అనే 21 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్‌కు(PubG) బానిసయ్యాడు. పబ్జీకి బానిసలా మారి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. అఖిల్ అమీర్‌పేట(Ameerpet) సిద్ధార్థ కాలేజ్‌లో(Siddhartha College) బీకాం(B.Com) సెకండియర్‌ చదువుతున్నాడు. గత కొంత కాలంగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదు. పబ్జీకి బానిసలాగా మారి మనిషి మనిషిలా లేడు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న తండ్రి విశ్వనాథ్‌ 2018లో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో తల్లితో కలిసి ఉంటున్న అఖిల్ పబ్జీకి అలవాటు పడ్డాడు.

ఈ క్రమంలో స్నేహితురాలిని కలిసేందుకు బయటకు వెళ్లిన తల్లి జయకు వాట్సాప్‌ మెసేజ్‌(Whatsapp Message) చేశాడు. 'బాయ్‌ మమ్మీ.. ఐ లవ్ యూ.. జాగ్రత్త' అంటూ తల్లికి మెసేజ్‌ పెట్టాడు. ఈ మెసేజ్‌ చేసిన తల్లి హుటాహుటిన ఇంటికి చేరుకొని వాచ్‌మెన్‌ సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అఖిల్‌ను వెంటనే కిందికి దించి నిమ్స్‌(NIMS) ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. దీంతో తల్లి జయ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన జయ.. ఇప్పుడు కొడుకును కోల్పోవడంతో స్థానికులు కంట తడి పెట్టారు.

Updated On 6 Jan 2024 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story