వైఎస్‌ వివేకా హ‌త్య‌ కేసులో అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఫైనల్ చార్జ్‌షీట్‌లో తన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇచ్చిన‌ వాంగ్మూలాన్ని కాకుండా చార్జిషీట్‌లో మరో స్టేట్‌మెంట్‌ను సీబీఐ చేర్చిందనీ అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు

వైఎస్‌ వివేకా హ‌త్య‌ కేసు(YS Viveka Murder Case)లో అజయ్ కల్లం(Ajay Kallam) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. సీబీఐ(CBI) ఫైనల్ చార్జ్‌షీట్‌(Chargesheet)లో తన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇచ్చిన‌ వాంగ్మూలాన్ని కాకుండా చార్జిషీట్‌లో మరో స్టేట్‌మెంట్‌ను సీబీఐ చేర్చిందనీ అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో 290వ‌ సాక్షిగా ఏప్రిల్ 29న అజయ్ కల్లం స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. సీఆర్‌పీసీ 161 ప్రకారం.. సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిందని.. 25 నిమిషాల పాటు నన్ను సీబీఐ విచారించిందని అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు.

నా స్టేట్‌మెంట్‌(Statement)ను రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి ఆడియో(Audio), వీడియో(Video) రికార్డింగ్ సీబీఐ చేయలేదు. నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత సీబీఐ నాకు కాపీ ఇవ్వలేదు. సీబీఐ నన్ను విచారించిన అంశం మూడో వ్యక్తికి కూడా తెలియదు. కానీ నేను సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు కొన్ని న్యూస్ పేపర్లు(News Papers) రాశాయి. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు పూర్తిగా విరుద్ధంగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పెట్టిందని పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

నేను సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. 2019 మార్చి 15న ఎన్నికల మేనిఫెస్టో(Manifesto )కు సంబంధించి వైఎస్ జగన్(YS Jagan) ఇంట్లో 5 గంటలకు సమావేశం అయ్యాం. ఒక వ్యక్తి వచ్చి వివేకా చనిపోయినట్లు జగన్ కి చెప్పటంతో.. ఆయ‌న షాక్‌కు గురయ్యారు. నేను సీబీఐకి ఎక్కడా భారతి పేరు చెప్పలేదు.. కానీ జగన్ ను భారతి(YS Bharati) పిలిస్తే వెళ్లినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నేను ఎక్కడ భారతి పేరును సీబీఐకి చెప్పలేదు. సీబీఐ నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్‌ను చార్జ్‌షీట్‌లో పెట్టింది. నన్ను విచారించింది ఎస్పీ వికాస్ కుమార్(SP Vikas Kumar) ఐతే.. నా స్టేట్‌మెంట్‌ కింద సంతకం వేరే వారిది ఉన్నది. కోర్టు రికార్డులో ఉన్న చార్జ్‌షీట్‌లో నుండి నా స్టేట్‌మెంట్‌ను తొలగించాలని అజయ్ కోర్టును కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Updated On 29 July 2023 7:51 PM GMT
Yagnik

Yagnik

Next Story