సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సుధీర్ఘ చర్చలు జరిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లిన మాణిక్ రావ్ ఠాక్రే, రోహిత్ చౌదరి.. భట్టి విక్రమార్కను కలిశారు.

AICC leaders who met Bhatti Vikramarka
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka)తో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే(Manikrao Thackrey), ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి(Rohit Chowdhary) సుధీర్ఘ చర్చలు జరిపారు. హైదరాబాద్(Hyderabad) నుంచి ప్రత్యేకంగా పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లిన మాణిక్ రావ్ ఠాక్రే, రోహిత్ చౌదరి.. భట్టి విక్రమార్కను కలిశారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చేరికలపైనా సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముగ్గురు నాయకులు సుమారు గంటన్నరకుపైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. పాదయాత్రలోనున్న భట్టి విక్రమార్కతో చర్చించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
