తెలంగాణలో రేవంత్‌(CM Revanth reddy) సర్కార్‌ సమర్థవంతంగా పనిచేస్తొందని ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో(LB stadium) జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో రేవంత్‌(CM Revanth reddy) సర్కార్‌ సమర్థవంతంగా పనిచేస్తొందని ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో(LB stadium) జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ(Parliament elections) పునరావృత్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్తలే బలమని, పార్లమెంట్‌ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని ఖర్గే కోరారు. మోదీని ఎదిరిస్తున్న తరుణంలో ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించారు. మనమంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రకటనలు తప్ప, చేసిన పనులు శూన్యమని ఖర్గే ఎద్దేవా చేశారు. మోదీ మాయ మాటలు విని ప్రజలు మోసపోవద్దని సూచించారు. మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని... దేశాన్ని అప్పుల్లో ముంచారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు న్యాయం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.

Updated On 25 Jan 2024 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story