కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పుల్ జోష్‌లో ఉంది. అదే జోష్‌లో తెలంగాణలోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ బలపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటికే కీలక కమిటీల నియామకం దాదాపుగా పూర్తిచేసింది.
కర్ణాటక ఎన్నికల(Karnataka Elections)లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్(Congress) పుల్ జోష్‌లో ఉంది. అదే జోష్‌లో తెలంగాణ(Telangana)లోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం(Congress High Command) భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ బలపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటికే కీలక కమిటీల నియామకం దాదాపుగా పూర్తిచేసింది. మరోవైపు రానున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha)కు కూడా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏఐసీసీ పరిశీలకుల(Observers)ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ప్రకటనలో వెల్లడించారు.
1. ప్రకాష్ రాథోడ్ - ఆదిలాబాద్
2. శ్రీనివాస్ మనే - భువనగిరి
3. అల్లం ప్రభు పాటిల్ - చేవెళ్ల
4. ప్రసాద్ అబ్బయ్య - హైదరాబాద్
5. క్రిస్టోఫర్ తిలక్ - కరీంనగర్
6. అరిఫ్ నసీం ఖాన్ - ఖమ్మం.
7. పరమేశ్వర నాయక్ - మహబూబాబాద్
8. మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్
9. రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి
10. బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్
11. పీవీ మోహన్ - నాగర్ కర్నూల్
12. అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ
13. సీడీ మేయప్పన్ - జహీరాబాద్
14. బీఎం నాగరాజ్ - నిజామాబాద్
15. విజయ్ నామ్దేవ్ రావ్ - పెద్దపల్లి .
16. రుబీ ఆర్ మనోహరన్ - సికింద్రాబాద్
17. రవీంద్ర ఉత్తంరావు దల్వి - వరంగల్