వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummla Nageswara Rao) రైతులను నిరాశపర్చే వార్త తెలిపారు.

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummla Nageswara Rao) రైతులను నిరాశపర్చే వార్త తెలిపారు. ఈ వానాకాలంలో రైతులకు రైతు భరోసా(Rythu barosa) లేనట్లేనని స్పష్టంగా చెప్పారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు. తుమ్మల సావు కబురు సల్లగా చెప్పిండని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నెలకు రాయాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిన కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నారని.. అన్నీ సక్కగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులకు హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story