తెలంగాణలో (Telangana)దాదాపు 20 శాతం సాగు విస్తీర్ణం(agriculture land) తగ్గిపోయింది.
తెలంగాణలో (Telangana)దాదాపు 20 శాతం సాగు విస్తీర్ణం(agriculture land) తగ్గిపోయింది. 15.30 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి సాగు తగ్గిపోయింది. 2.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు తగ్గిపోయింది. గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం.పెట్టుబడి సాయం రైతుబంధు అందక, రుణ మాఫీ విషయంలో గందరగోళంతో భారీగా తగ్గిన వరిసాగు తగ్గిపోయిందని వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. పంట వేసే ముందు పెట్టుబడి సాయం రైతుబంధు ఇవ్వలేకపోవడం, గత నెల వర్షాలు లేకపోవడం, చెరువులు ఎండిపోయి ఉండడంతో తగ్గిన సాగు విస్తీర్ణం. వరి బోనస్‌పై మాట మార్చడంతో 66 లక్షల్లో వరి పంట సాగు చేస్తారని అంచనా వేయగా.. కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే వరి సాగు జరిగింది. ఇక చెరువులు అలుగు పోసే సమయంలో ఇంకా రాష్ట్రంలోని 15,131(61.34%) చెరువుల్లో 25% కంటే తక్కువే నీళ్లు ఉన్నాయి.