మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన జూపల్లి.. తాను ఏ పార్టీలో చేరేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy).. శీనన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం ఇరువురిపై సస్పెన్షన్ వేటు వేసింది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏ పార్టీలో చేరే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన జూపల్లి.. తాను ఏ పార్టీలో చేరేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy).. శీనన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం ఇరువురిపై సస్పెన్షన్ వేటు వేసింది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏ పార్టీలో చేరే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఈ ఇరువురు ఏ పార్టీలో చేరుతారు అనే విషయమే జోరుగా చర్చ జరుగుతుంది. ఇరువురు జాతీయ పార్టీలో చేరుతారనే ఊహగానాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో జూప‌ల్లికి జాతీయ పార్టీ నుండి పిలుపువ‌చ్చింది. మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ(D. K. Aruna) జూపల్లి కృష్ణారావుని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఇరువురు నేతలు కాంగ్రెస్(Congress) లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇరువురిది మహబూబ్ న‌గర్ జిల్లా(Mahabubnagar District)నే. మహబూబ్ న‌గర్ లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన డీకే అరుణ.. జూపల్లి కృష్ణారావుని ఆహ్వానించడం రాజకీయంగా చర్చనీయాంశ‌మైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జూపల్లి కృష్ణారావు.. మహబూబ్ న‌గర్ జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. జిల్లాలో బలమైన నాయకుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మూడుసార్లు మంత్రిగా కూడా పనిచేశాడు. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉన్న జూపల్లిని పార్టీ లోకి తీసుకుంటే జిల్లాలో బీజేపీ మరింత బలపడుతుందని డీకే అరుణ, పార్టీ వ్యూహంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూపల్లిని పార్టీలో ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరి జూపల్లి తనకు మంచి అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ గూటికి వెళతారో.. వీరి ఆహ్వానాన్ని మన్నించి బీజేపీలో చేరుతారో వేచి చూడాలి.

Updated On 11 April 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story