ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని(Farm house) బాత్‌రూమ్‌లో జారిపడ్డ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్(KCR) యశోదలో చికిత్స పొందుతున్నారు. దాదాపు వారంపాటు యశోదలోనే ఉంటున్న ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని వైద్యులు(Doctors) వెల్లడించారు. ఆయన ఇంటికి వెళ్లేందుకు వైద్య బృందం అనుమతి లభించిందని తెలుస్తోంది. ఈనెల 15న కేసీఆర్ డిశ్చార్జి(Discharge) అయ్యే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ డిశ్చార్జి తర్వాత ఎక్కడికి వెళ్తారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు ఈ సమయంలో వెళ్లలేరు. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌లోనే(Hyderabad) ఉండే అవకాశం ఉంది. నందినగర్‌లోని(Nandinagar) తన పాత ఇంటికే కేసీఆర్ వెళ్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని(Farm house) బాత్‌రూమ్‌లో జారిపడ్డ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్(KCR) యశోదలో చికిత్స పొందుతున్నారు. దాదాపు వారంపాటు యశోదలోనే ఉంటున్న ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని వైద్యులు(Doctors) వెల్లడించారు. ఆయన ఇంటికి వెళ్లేందుకు వైద్య బృందం అనుమతి లభించిందని తెలుస్తోంది. ఈనెల 15న కేసీఆర్ డిశ్చార్జి(Discharge) అయ్యే అవకాశం ఉంది.
అయితే కేసీఆర్ డిశ్చార్జి తర్వాత ఎక్కడికి వెళ్తారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు ఈ సమయంలో వెళ్లలేరు. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌లోనే(Hyderabad) ఉండే అవకాశం ఉంది. నందినగర్‌లోని(Nandinagar) తన పాత ఇంటికే కేసీఆర్ వెళ్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నందినగర్‌లోని కేసీఆర్ ఇంటిని సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అయితే ఆ ఇల్లు కొంత కంజెస్టెడ్‌గా(Conjested) ఉంటుందని బీఆర్ఎస్(BRS) శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్‌ను పరామర్శించేందుకు పలువురు ఆయన నివాసానికి వస్తారని.. ఆ ప్రాంతంలో రద్దీ ఏర్పడుతుందని.. ఇంట్లో కూడా స్పేస్ తక్కువగా ఉండడంతో ఎం చేద్దామని మల్లగుల్లాలు పడుతున్నారు.
కేసీఆర్ యశోద ఆస్పత్రిలో(Yashoda hospital) ఉన్నప్పుడే పరామర్శల వెల్లువ వెల్లువెత్తింది. సీఎం రేవంత్(CM Revanth), మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) సహా తెలంగాణ మంత్రులు(Telangana Minister), బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు వరుసగా కేసీఆర్‌ను పరామర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు యశోద ఆస్పత్రికి తరలిరావడంతో స్వయంగా ఆయన వీడియో (Video)విడుదల చేసి.. క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోలుకున్న తర్వాత అందరినీ కలుస్తానని కేసీఆర్ విన్నవించారు. ఈ క్రమంలో నందినగర్‌లోని ఆయన ఉంటున్న ఇల్లు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా సరిపోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.