హైదరాబాద్(Hyderabad)లో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీకి కాదు అనర్హం అంటూ దేనినీ వదలట్లేదు. పాలల్లో యూరియ వేసి కల్తీలకు పాల్పడుతుండడం చూశాం. పశువుల ఎముకలతో వంట నూనె తయారీని చూశాం. నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టు తయారుచేస్తున్న ఘటనలూ రోజూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం.
మీ పిల్లలకు చాక్లెట్లు ఇస్తుంటే ఒక్క సారి ఆలోచించండి..!
కల్తీదేదో.. క్వాలిటీదేదో తెలుసుకోండి..!
అడ్డమైన చాక్లెట్లు ఇచ్చి చిన్నారుల భవిష్యత్‌ను పాడుచేయకండి..!
పౌష్టికాహారం ఇచ్చి బుడతల ఆరోగ్యాన్ని కాపాడండి..!
హైదరాబాద్(Hyderabad)లో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీకి కాదు అనర్హం అంటూ దేనినీ వదలట్లేదు. పాలల్లో యూరియ వేసి కల్తీలకు పాల్పడుతుండడం చూశాం. పశువుల ఎముకలతో వంట నూనె తయారీని చూశాం. నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టు తయారుచేస్తున్న ఘటనలూ రోజూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలన్నీ మరవక ముందే కల్తీ చాక్లేట్స్ తయారీ చేస్తున్న వైనం బయటపడింది. చిన్నారులనూ వదలని కేటుగాళ్లు. ధన దాహాం, అత్యాశతో చిన్నారుల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడంలేదు. నకిలీ చాక్లెట్లు తయారు చేస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులు.
హైదర్‌గూడ(Hyderguda లో సుప్రజా ఫుడ్స్(Supraja Foods) పేరుతో కల్తీ దందాకు తెరలేపారు కల్తీగాళ్లు. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లేట్స్ తయారీ చేస్తున్నారు. ఈ చాక్లెట్ల తయారీలో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. చాక్లెట్లు తయారీ కేంద్రంలో మినిమం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. మరో వైపు ఈ పరిశ్రమలో దుర్గంధం వస్తున్నా చాక్లెట్ల తాయరీ చేస్తున్నారీ కంత్రీగాళ్లు. వాటికి ఆకర్షణీయమైన స్టిక్కరింగ్ చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కుళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్‌లో ప్యాక్ చేసి స్థానికంగా ఉన్న చిన్న చిన్న షాపులకు సప్లై చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతులు లేకుండానే ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.
అధికారులు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరించడం, నామమాత్రంగా జరిమానాలు విధించడంతో కల్తీ కంత్రీగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.
ఈ మధ్యే కల్తీ ఐస్ క్రీం దందా కూడా బయటపడింది. కొందరు కంత్రీగాళ్లు ప్రమాదకర రసాయనాలు వాడి ఐస్ క్రీంలు తయారు చేసి వాటికి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు.ఇలాంటి కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి చాకెట్లు, ఐస్‌క్రీంలు కొనే ముందు వాటి గురించి తెలుసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. నాణ్యతలేని చాక్లెట్లు కొనిస్తే పిల్లల హెల్త్ దెబ్బతింటుందని, ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు