ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) మతిమరుపు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) మతిమరుపు ఉందో లేకపోతే తెలంగాణ ప్రజలకు మతిమరుపు ఉన్నదని ఆయన అనుకుంటున్నారో తెలియదు కానీ అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు రిటైర్డ్ అధికారులను ప్రభుత్వంలో ఎలా తీసుకుంటారు? అంటూ గాయగత్తర చేసిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తున్నారు. రిటైరైన ఐఏఎస్(Retaired IAS officer ), పోలీసు అధికారులను ప్రభుత్వంలో నియమించడం దారుణమని, కేసీఆర్(KCR) సర్కార్ వెంటనే ఇలాంటి అధికారులను తొలగించాలని, అవసరమైతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పాపం రేవంత్ రెడ్డి మాత్రం అది మర్చిపోయినట్టు ఉన్నారు. అందుకే విమరణ పొందిన వారిని పోలీస్, నీటిపారుదల శాఖల్లో నియమించారు. లేటెస్ట్‌గా హైదరాబాద్ జలమండలిలో ఓ రిటైర్ అయిన ఉద్యోగిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ శాఖలో విరమణ పొందిన ఈఎన్సీతో పాటు, పదవీకాలం ముగిసిన ప్రభుత్వ సలహాదారుడిని తిరిగి కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను(Adityanath Das) రేవంత్‌రెడ్డి ఏరికోరి తెలంగాణకు తెచ్చుకున్నారు. తెచ్చుకోవడమే కాకుండా ఆయనకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టారు.
ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య మే 31వ తేదీన రిటైరయ్యారు. ఆ వెంటనే ఆయనకే తిరిగి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలను అప్పగించింది రేవంత్ సర్కారు. రాష్ట్ర శాసనసభకు సలహాదారు పదవిలో ప్రభుత్వం నియమించిన సూర్యదేవర ప్రసన్నకుమార్ కూడా రిటైరైన వారే!
హైదరాబాద్ జలమండలిలో ఈడీగా పనిచేస్తున్న ఈఎన్సీ డాక్టర్ ఎం సత్యనారాయణ ఇటీవలే రిటైరయ్యారు. అయినా ప్రభుత్వం ఆ పదవిలో ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సర్కారు తీరు పట్ల ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.