అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు(Additional DCP Venkateswarlu )కుమారుడు చంద్ర తేజ్(Chandra Tej) గుండెపోటు(Heart Attack)తో మరణించాడు. చంద్ర తేజ్ ఆకస్మిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రి గుండెపోటుతో చంద్ర తేజ్ చనిపోయారు. చంద్రతేజ్ సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు

Hyderabad
అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు(Additional DCP Venkateswarlu )కుమారుడు చంద్ర తేజ్(Chandra Tej) గుండెపోటు(Heart Attack)తో మరణించాడు. చంద్ర తేజ్ ఆకస్మిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రి గుండెపోటుతో చంద్ర తేజ్ చనిపోయారు. చంద్రతేజ్ సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం అతడు వ్యాపారంలో స్వతహాగా రాణిస్తున్నాడు. చంద్రతేజ్ ఇటీవలే సంక్రాంతి పండుగ రోజు తన తండ్రికి కారు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. ఇంట్లో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చంద్రతేజ్ భౌతికకాయాన్ని స్వగ్రామం నల్లగొండ జిల్లా అల్వాల్ ఎక్స్ రోడ్స్ నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసిన వెంకటేశ్వర్లు కొడుకు మృతి చెందడంతో గుండెలు పగిలేలా వినిపిస్తున్నారు. ప్రతిరోజు ఉల్లాసంగా తిరుగుతూ ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించే చంద్రతేజ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో అతని బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
