తనపై కేసులు(Case) నమోదవ్వడంతో నటి శ్రీరెడ్డి(Sri reddy) బెదరిపోయింది

తనపై కేసులు(Case) నమోదవ్వడంతో నటి శ్రీరెడ్డి(Sri reddy) బెదరిపోయింది. మొన్నటి వరకు సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోయిన శ్రీరెడ్డి ఇప్పుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan), ఇటు మంత్రి నారా లోకేశ్‌లకు(Nara lokesh) స్వదస్తూరితో లేఖలు రాశారు. ఇప్పుడా లేఖలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నారా లోకేశ్‌కు సుదీర్ఘమైన లేఖనే రాశారు. లోకేశ్‌ అన్నకు విజ్ఞప్తి అంటూ లేఖను(Letter) మొదలు పెట్టిన శ్రీరెడ్డి తనను క్షమించాల్సిందిగా(Apology) వేడుకున్నారు. తాను పుట్టింది గోదావరి అయినా.. పెరిగింది మొత్తం విజయవాడ పరిసరాలలో అని, తనకు లోకేశ్‌ సామాజికవర్గానికి చెందినవారే 95 శాతం స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు.అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబసభ్యులను ఎంతో సంతోష పెట్టిందని, తమకున్న అరకొర సొంత ఇంటి రేట్లు పెరిగాయని, అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే(TDP) ఓటు వేశారని అన్నారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని.. అయినా తనకు అంత స్థాయి లేదని, అందుకే బహిరంగ లేఖ రాస్తున్ననని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. గత పదిరోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్ లు, డిస్కషన్లు, డిబేట్లు, కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు ఓ విషయం అర్ధమైందని.. అదేమిటంటే... తాను ఇంతకాలం ఎంతో మంది మనోభావాలు దెబ్బతీశానన్న సంగతి తెలిసొచ్చిందని శ్రీరెడ్డి తెలిపారు. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడానో తనకే తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌ , వారి కుటుంబ సభ్యులకు, హోంమినిస్టర్ కు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి, 99, ప్రైం టీవీ, పవన్ కల్యాణ్(Pawan kalyan), వీరమహిళలకు క్షమాపణలు చెప్పారు. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ రాశానని అనుకోకూడదని, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ధి వంకర అవుతుందని భావించకూడదని, అలా జరిగితే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చని.. ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని.. తమ కుల దైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నానని శ్రీరెడ్డి సుదీర్ఘమైన ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన ముగ్గురు పిల్లలు ఉన్నారని.. దయచేసి తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు. కేసుల నుంచి తనను విముక్తురాలిని చేయాలని కోరారు. ఇదే సమయంలో చిరంజీవి, నాగబాబు, సినిమా ఫ్రెండ్స్ కి సారీ చెబుతున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో జగన్‌, భారతిలకు మరో ఉత్తరం రాశారు. జగనన్నకి, భారతమ్మకు నమస్కారాలు అంటూ లేఖను ప్రారంభించారు.ఈ జన్మకు వారిద్దరినీ నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫోటో దిగే అవకాశం కానీ కలిగి ఉండే అదృష్టాన్ని తాను కోల్పోయానని అనుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీకి తన ప్రవర్తనతతో చెడ్డ పేరు తెచ్చానని శ్రీరెడ్డి ఒప్పుకున్నారు.

తాను వైసీపీ సభ్యురాలిని కానప్పటికీ... సాక్షిలో పనిచేసినప్పటి నుంచీ జగన్, భారతిలపై గౌరవమర్యాదలు ఏర్పడ్డాయని.. ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటొందని.. తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాయో అర్ధం చేసుకోగలలని లేఖలో రాశారు. ఈ సందర్భంగా తాను వైసీపీకి, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని చెబుతూ తనను క్షమించాలని కోరారు.

Eha Tv

Eha Tv

Next Story