బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. కేవలం పాలిటిక్స్‌కే పరిమితం కాకుండా అనేక అంశాలపై తన అభిప్రాయలను పంచుకుంటుంటారు కేటీఆర్. సామాజిక అంశాలను కూడా స్పృశిస్తుంటారు.

Samantha reply to KTR post
బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. కేవలం పాలిటిక్స్‌కే పరిమితం కాకుండా అనేక అంశాలపై తన అభిప్రాయలను పంచుకుంటుంటారు కేటీఆర్. సామాజిక అంశాలను కూడా స్పృశిస్తుంటారు. లేటెస్ట్‌గా కేసీఆర్(KCR) ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. దానికి సినీ నటి సమంత(Samantha) కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ(Telangana)లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. అప్పట్నుంచి నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు కేటీఆర్. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిత్యం సభలు, సమావేశాలలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ఇతర మంత్రులు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు. విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కేటీఆర్ ఓ ఫోటోను షేర్ చేశారు. చుట్టూ ప్రజల మధ్య తాను చిరు నవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో అది! ఆ ఫోటోకు చిన్నపాటి వ్యాఖ్యానాన్ని కూడా జత చేశారు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా...చిరునవ్వుతో ఎదుర్కోవాలి' అంటూ రాసుకొచ్చారు కేటీఆర్. కేటీఆర్ ఫోటోకు మొట్టమొదట కామెంట్‌ను సమంత చేసింది.. కేటీఆర్ షేర్ చేసి ఫోటోను లైక్ చేసింది. ఆ ఫోటోకు నమస్తే ఎమోజీని కామెంట్‌గా పెట్టింది సమంత.
