మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పరిశ్రమలోని చీకటి కోణాలను వెలికి తీసి ప్రకంపనలు సృష్టించింది

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పరిశ్రమలోని చీకటి కోణాలను వెలికి తీసి ప్రకంపనలు సృష్టించింది జస్టిస్‌ హేమ కమిటి(Justice Hema committie ). . పురుషాధిక్య రంగమైన ఈ ఫీల్డ్‌లో మహిళా ఆర్టిస్టులను బానిసల కంటే హీనంగా చూస్తారని, వారిని సెక్స్‌ వస్తువుగానే పరిగణిస్తారని హేమ కమిటీ తెలిపింది. పలుకుబడి ఉన్నవారు మహిళా ఆర్టిస్తులను వేధింపులకు గురి చేస్తున్నారని హేమ కమిటీ తెలిపింది. ఈ కమిటీ నివేదిక తర్వాత మలయాళ పరిశ్రమలోని మహిళా ఆర్టిస్టులు తమకు జరిగిన చేదు అనుభవాలను నెమరేసుకుంటున్నారు. మగ ఆర్టిస్టుల దురాగతాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే ఆరోపణలను ఎదుర్కొంటున్న అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్టు(AMMA) ప్రధాన కార్యదర్శి సిద్దిఖీ(Siddique), దర్శకుడు రంజిత్‌(Ranjith) తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ముఖేశ్‌, మణ్యం పిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్యల దాష్టికాలను మిను మునీర్‌(Meena munir) అనే నటి సోషల్‌ మీడియాలో విపులంగా చెప్పారు. 2013లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ముఖేశ్‌(Mukesh), మణ్యంపిళ్లై రాజు(manyampillai raju), ఇడవెల బాబు(Idavela babu), జయసూర్య(Jayya surya) తనను శారీరకంగా వేధించారని నటి మిను మునీర్‌ తెలిపారు. తనను అకారణంగా దూషించేవారని, సర్దుకుపోయి పని చేసుకుందామని ప్రయత్నించాను కానీ తన వల్ల కాలేదని ఆమె అన్నారు. ఆ వేధింపులు తార స్థాయికి చేరుకోవడంతో తాను మలయాళ ఇండస్ట్రీని వదిలివేశానని ఆమె అన్నారు. వీరి కారణంగా తాను పడిన వేదనకు, దాని పర్యవసానాలకు ఇప్పుడు తనకు న్యాయం కావాలన్నారు. .తన పట్ల దారుణంగా ప్రవర్తించిన ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారు అడిగినదానికి ఒప్పుకోలేదని తనతో దురుసుగా ప్రవర్తించారని మిను మునీర్‌ తెలిపారు. 'క్యాలెండర్‌ సినిమా షూటింగ్‌లో మణ్యం పిళ్లై రాజుకు భార్యగా నటించాను. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నన్ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. నా భర్త చనిపోయాడని చెప్పినందుకు ఒక్కదానివి సంతోషంగా ఎలా ఉంటున్నావని ఇబ్బందికరంగా మాట్లాడాడు. జయసూర్య అయితే డె ఇంగోట్‌ నొక్కి(2108) సినిమా సమయంలో నన్ను బలవంతంగా వెనకనుంచి హత్తుకుని ముద్దుపెట్టాడు. మరో నటుడైతే రాత్రికి వస్తానంటూ నీచంగా మాట్లాడాడు. ఇంకొకరు హోటల్‌ గదిలో నాపై అత్యాచారం చేయబోయాడు' అంటూ ఆ నలుగురి బండారాన్ని బయటపెట్టారు మిను మునీర్‌.

Updated On 26 Aug 2024 11:14 AM GMT
Eha Tv

Eha Tv

Next Story