తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి(Kasturi)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి(Kasturi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 3 నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో(Rajendra nagar) తమిళ పోలీసులు(Tamil police) అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి(chennai) తరలిస్తున్నారు.
తమిళనాడులోని తెలుగువారిపై తప్పుడు మాటలు మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా మంది ఆమెపై కేసులు పెట్టారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు(Madras High Court) ను కస్తూరి ఆశ్రయించింది. అయితే నటి పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వెళితే ఆమె ఇంటికి తాళం వేసి ఉంది.
మొబైల్ కూడా స్విచ్ఛాప్‌లో ఉంది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో చెన్నై పోలీస్ కమిషన్ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపారు. సినీ నిర్మాత ఒకరు కస్తూరి తమిళనాడు నుంచి తప్పించుకునేందుకు సాయం చేశారట! అయితే, ఆ నిర్మాత ఎవరో చెప్పటానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. కస్తూరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను పార్టీ దూరంగా పెట్టింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించడంతో పాటు వివరణ కూడా ఇచ్చుకుంది.
' 300 సంవత్సరాల కిందట ఒక రాజు దగ్గర అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారు.ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు?', అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను ఉద్దేశించి కస్తూరి కామెంట్ చేసింది. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి విమర్శించారు. ఆమె చేసిన వ్యాఖ్యల పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కస్తూరి సారీ చెప్పింది తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు కస్తురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.