మాదాపూర్ డ్రగ్స్ కేసులో(Drugs) విచారణ నిమిత్తం టాలీవుడ్ నటుడు నవదీప్(Navdeep) శనివారం అధికారుల ఎదుట హాజర య్యారు. డ్రగ్స్ కేసులో నవదీప్ కు హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు నార్కోటిక్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ(41A CRPC Notices) నోటీసులు జారీ చేశారు. 23న విచారణ నిమిత్తం రావాలని నోటీసులలో పేర్కొన్నారు.

Navdeep In Madhapur Police Station
మాదాపూర్ డ్రగ్స్ కేసులో(Drugs) విచారణ నిమిత్తం టాలీవుడ్ నటుడు నవదీప్(Navdeep) శనివారం అధికారుల ఎదుట హాజర య్యారు. డ్రగ్స్ కేసులో నవదీప్ కు హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు నార్కోటిక్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ(41A CRPC Notices) నోటీసులు జారీ చేశారు. 23న విచారణ నిమిత్తం రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హీరో నవదీప్ కొద్దిసేపటి క్రితమే హెచ్ న్యూ ఆఫీస్‌కు హాజరయ్యారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఉన్న హీరో నవదీప్ కొన్ని రోజులపాటు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
కానీ తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా హీరో నవదీప్ తెలిపారు. తనకు ఈ కేస్ తో సంబంధం లేదు అని.. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. నవదీప్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు సహకరించాలని పేర్కొంది. అలాగే.. నవదీప్ కు నోటీసులు జారీ చేయాలని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో నార్కోటిక్ బృందం ఈ నెల 23వ తేదీన 10 గంటలకు విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు అందుకున్న నవదీప్ కొద్దిసేపటి క్రితమే విచారణ నిమిత్తం అధికారుల ఎదుట హాజరయ్యారు.
