శామీర్‌పేట(Shameerpet) సెలబ్రిటీ క్లబ్‌లో(Celebrity Club) కాల్పుల(Shootout) ఘ‌ట‌న‌ కలకలం సృష్టించింది. సిద్ధార్ధ్ దాస్‌(Siddharth Das) అనే వ్యక్తిపై మ‌నోజ్‌(Manoj) మరో వ్యక్తి కాల్పులు జరి పాడు. తృటిలో త‌ప్పించుకున్న సిద్ధార్ధ్ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శామీర్‌పేట(Shameerpet) సెలబ్రిటీ క్లబ్‌లో(Celebrity Club) కాల్పుల(Shootout) ఘ‌ట‌న‌ కలకలం సృష్టించింది. సిద్ధార్ధ్ దాస్‌(Siddharth Das) అనే వ్యక్తిపై మ‌నోజ్‌(Manoj) మరో వ్యక్తి కాల్పులు జరి పాడు. తృటిలో త‌ప్పించుకున్న సిద్ధార్ధ్ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ యువకుడు కాల్పులు జరిపినట్లుగా 100 కు స‌మాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే శామీర్‌పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మనోజ్ అనే వ్యక్తి.. సిద్దార్థ్ దాస్ పై కాల్పులు జ‌ర‌ప‌డం స్థానికంగా కలకలం రేగింది.

వివ‌రాళ్లోకెళితే.. సిద్దార్థ్ దాస్ అనే వ్యక్తి వైజాగ్(Vizag) లోని హిందూజా ధర్మల్ పవర్(Hinduja Thermal Power) లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. సిద్ధార్థతో భార్యకు విభేదాలు ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఇద్ద‌రి పిల్ల‌ల‌తో స‌హా మనోజ్ అనే వ్యక్తి వ‌ద్ద ఉంటుంది. సిద్ధార్థ్ దాస్.. సెలబ్రెటీ రిసార్ట్స్‌ లో త‌న పిల్ల‌లు, భార్య‌ ఉన్న విల్లాకు శ‌నివారం వచ్చాడు. దీంతో సిద్ధార్థ్ దాస్, మనోజ్ కు మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఆగ్రహానికిలోనైన మనోజ్ తన వద్ద ఉన్న హెయిర్ గన్నుతో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపారు.

తృటిలో త‌ప్పించుకున్న సిద్ధార్థ్ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

సిద్ధార్థకు స్మితతో 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో స్మిత మనోజ్‌కు ద‌గ్గ‌రైంది. గత మూడేళ్లుగా సిద్ధార్థ దాస్ భార్య స్మిత.. మనోజ్‌తో ఉంటుందని తెలుస్తోంది.

Updated On 15 July 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story