నటుడు జయరామ్.. తెలుగు, తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడు. ఆయన కుమార్తె మాళవిక జయరామ్, నవనీత్ గిరీష్‌ను మే 3న వివాహం చేసుకున్నారు.

Actor Jayaram’s daughter Malvika gets married
నటుడు జయరామ్.. తెలుగు, తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడు. ఆయన కుమార్తె మాళవిక జయరామ్, నవనీత్ గిరీష్‌ను మే 3న వివాహం చేసుకున్నారు. నవనీత్ యూకేలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఈ జంట కేరళలోని గురువాయూర్ దేవాలయంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 1992లో జయరామ్, అతని భార్య పార్వతి కూడా ఇదే గుడిలో పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు మోహన్‌లాల్ వచ్చినట్లు సమాచారం. ఆయన దంపతులను ఆశీర్వదించారు. మాళవిక, నవనీత్‌ల నిశ్చితార్థం డిసెంబర్ 2023లో జరిగింది. జయరామ్ 'భాగమతి', ‘గుంటూరు కారం’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో నటించారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్'లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు.
