కొద్దిరోజుల కిందట ఫిబ్రవరి 13న లాస్య నందిత పెను ప్రమాదం నుండి బయటపడింది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత ఆమె కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్య నందిత తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు వెంటాడాయి. డిసెంబరు 24న బోయిన్‌పల్లి వద్ద లిఫ్ట్‌లో చిక్కుకుపోయింది.బోయినపల్లిలోని వీఆర్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్య నందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతుండగా లిఫ్ట్ లో ఇబ్బంది పడింది. లిఫ్ట్ డోర్ తెరుచుకోకపోవడంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు పలువురు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు మరికొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
కొద్దిరోజుల కిందట ఫిబ్రవరి 13న లాస్య నందిత పెను ప్రమాదం నుండి బయటపడింది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా.. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. ఆరోజు ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే లాస్య నందిత తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు.
లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. "కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు.