ప్రభుత్వ ఉ ద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అని కొందరు ఎందుకు పాకులాడుతారో ఇలాంటి వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ప్రజలకు సేవ చేద్దామని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగమైతే జీవితం సాఫీగా సాగుతుందని.. జీవితంలో ఏ బాదరాబందీ లేకుండా గడుపొచ్చని ఆలోచిస్తారు. ఇంకొందరుంటారు ఒక్క సారి సర్కార్‌ కొలువు కొడితే లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించొచ్చని చూస్తారు. అలాంటి తరహాలోకే ఈ తహశీల్దారు(Tahsildar) చేరుతారు.

ప్రభుత్వ ఉ ద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అని కొందరు ఎందుకు పాకులాడుతారో ఇలాంటి వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ప్రజలకు సేవ చేద్దామని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగమైతే జీవితం సాఫీగా సాగుతుందని.. జీవితంలో ఏ బాదరాబందీ లేకుండా గడుపొచ్చని ఆలోచిస్తారు. ఇంకొందరుంటారు ఒక్క సారి సర్కార్‌ కొలువు కొడితే లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించొచ్చని చూస్తారు. అలాంటి తరహాలోకే ఈ తహశీల్దారు(Tahsildar) చేరుతారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు(Illegal Assets) కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్‌ జిల్లా(Karimnagar) జమ్మికుంట తహసీల్దార్‌ రజిని(Tahsildar Rajini) ఇంటిలో ఏసీబీ అధికారులు(ACB) దాడులు నిర్వహించారు. హనుమకొండ కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో ఉన్న రజినీ నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె సమీప బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. గతంలో రజిని పనిచేసిన ధర్మసాగర్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ అవినీతి తిమింగలం ఇంట్లో సోదాలు నిర్వహించగా దొరికిన ఆస్తులు, వాటి పత్రాలు చూసి ఏసీబీ అధికారులు నోరెళ్లబెట్టారు.

ఏసీబీ సోదాల్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వా ధీనం చేసుకున్నారు. రూ.25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ గుర్తించి, బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చి సీజ్‌ చేయించారు. రజనీ అక్రమ ఆస్తుల వివరాలను కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరించారు. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.3.12 కోట్లు కాగా, ఓపెన్‌ మార్కెట్‌లో రూ.12 కోట్లకుపైమాటే అని
ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఈ ఆస్తుల్లో రెండు అంతస్థుల భవనం, 21 ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌, కిలోన్నర బంగారు అభరణాలు, 2 కార్లు, 3 బైక్‌లు, లక్షన్నర నగదు ఉన్నాయని మీడియాకు తెలిపారు. ఆ తర్వాత తహశీల్దార్‌ రజినిని అరెస్ట్‌ చేసి, కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. గతంలోనే రజినీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని శాయంపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్‌ మండలాల్లో పనిచేశారు. ధర్మసాగర్‌ మండలంలోని ఓ భూవివాదంలో చిక్కుకోగా, జమ్మికుంటలో పనిచేస్తున్నప్పుడు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోగా అప్పట్లోనే ఏసీబీకి ఆమెపై ఫిర్యాదులందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆగస్టులో జమ్మికుంట తహసీల్దార్‌గా రజినీని బదిలీ చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు అదునుచూసి, మాటు వేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated On 14 March 2024 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story