గత ప్రభుత్వం హైదరాబాద్‌లో(Hyderabad) ఫార్ములా రేస్‌(Formula race) ఘనంగా నిర్వహించింది.

గత ప్రభుత్వం హైదరాబాద్‌లో(Hyderabad) ఫార్ములా రేస్‌(Formula race) ఘనంగా నిర్వహించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. అప్పటి మంత్రి కేటీఆర్‌(KTR) ప్రోత్సాహంతో ఈ రేస్‌ను నిర్వహంచారు. అయితే గత ప్రభుత్వంలో రూ.53 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారని ప్రభుత్వం విచారణకు పూనుకుంది. ఈ కేసులో అధికారులను ఏసీబీ(ACB) విచారించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతోంది ఏసీబీ. ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా అరవింద్ కుమార్ విచారించేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది ఏసీబీ. రూ.53 కోట్లు ఎవరు చెప్తే విదేశీ కంపెనీలకు చెల్లించారని విచారించనుంది. దీంతో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు(KTR) ఇది చుట్టుకునే అవకాశం ఉంది. దీపావళి ముందే గత ప్రభుత్వంలోని పెద్దల అరెస్టులు ఉంటాయన్న పొంగులేటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తొలుత టానిక్‌ షాపు వ్యవహారంలో కేటీఆర్‌ అరెస్టవుతారని అందరూ భావించారు. ఆ తర్వాత పలు వ్యవహారాలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజాగా ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ దూకుడుతో మరోసారి కేటీఆర్‌ అరెస్టుపై ఊహాగానాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీకి లేఖ రాయడంతో దర్యాప్తుకు ప్రభుత్వం ఓకే చేసింది. దీంతో రంగంలోకి దిగేసింది ఏసీబీ. దీనికి సంబంధించి ఫైళ్లను అధికారుల నుంచి తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు విదేశీ కంపెనీలకు నిబంధనలకు తలొగ్గి 55 కోట్లు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. నిధుల వ్యవహారం వెనుక అప్పటి పెద్దలు ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. అప్పట్లో మున్సిపల్ శాఖకు కేటీఆర్ మంత్రిగా వ్యవహరించారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నోరు విప్పితే కేటీఆర్‌కు చిక్కులు తప్పవని అంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫార్ములా రేస్‌ను నిర్వహింయచి హైదరాబాద్‌కే కాకుండా దేశానికే పేరు తీసుకొచ్చారని బీఆర్‌ఎస్(BRS) నేత క్రిషాంక్‌(Krishank tweet) ట్వీట్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఫార్ములా రేస్‌ను తెరపైకి తెచ్చి కేటీఆర్‌ను అరెస్ట్ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. కేసులకు, జైళ్లకు భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ ధీటుగా స్పందిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story