కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. పథకాలు పొందేందుకు ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి హాజరై క్యూ లైన్లలో నిలబడి మరీ దరఖాస్తులు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీసుకొచ్చిన అభయహస్తం(Abhaya Hastham) కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. పథకాలు పొందేందుకు ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి హాజరై క్యూ లైన్లలో నిలబడి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. డిసెంబర్ 28న మొదలైన ఈ కార్యక్రమం జనవరి 6న ముగిసింది. కోటి మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇంత సిరీయస్‌గా జరిగిన ఈ కార్యక్రమంలోనూ ఆకతాయిలు తమ అతితెలివి ప్రదర్శించారు. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) పేరిటనే ప్రజాపాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులో కొడుకులుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy), భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) లను పేర్కొనగా.. కూతురుగా కొండా సురేఖ(Konda Surekha), అల్లుడుగా శ్రీధర్ బాబు(Sridhar Babu) పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు దరఖాస్తు ఇచ్చారు ఆకతాయిలు. ప్రస్తుతం దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పథకాల కోసం సామాన్యులం బాధపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం తిన్నది అరగక ఇలాంటివి చేస్తున్నారు అంటూ ప్రజలు వైరలవుతున్న దరఖాస్తుపై మండిపడుతున్నారు.