ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం చేసుకోలేని పరిస్థితి. సొంత వారనుకున్నవారే మోసాలు చేస్తున్నారు.

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం చేసుకోలేని పరిస్థితి. సొంత వారనుకున్నవారే మోసాలు చేస్తున్నారు. ప్రధానంగా మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుంది. కుటుంబ పోషణ కోసమనో లేదా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నారు. మహిళలు కూడా చాలా వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సమాజంలో కొన్ని అసాంఘిక శక్తుల మాయ మాటల్లో పడి వారి చేతుల్లో మోస పోతున్నారు. ఇలాంటి తరహాలోనే హైదరాబాద్‌లో(Hyderabad) ఓ దారుణం జరిగింది. రియల్‌ ఎస్టేట్‌(Real estate) కంపెనీలో పనిచేస్తున్నఓ యవతికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి(Gang Rape) ఒడిగట్టారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయాక 5 గంటలపాటు అత్యాచారం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

జేఎస్‌ఆర్‌ గ్రూప్‌ సన్‌సిటీ(JSR sun city) అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఓ యువతి ట్రైనీగా చేరింది. ఇదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్‌ విజిట్‌ కోసమని యాదాద్రికి కారులో వెళ్లారు. తమ కంపెనీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను చూసి తిరిగి వస్తుండగా ఈ కామాంధులకు కోరిక కలిగింది. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం కొన్ని ఆహార పదార్థాల్లో మత్తు మందు ఇచ్చి తినాలని కోరగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఏమీ తినలేదు కనీసం కూల్‌ డ్రింక్‌ అయినా తాగు అని ఆమెను పదే పదే కోరగా బాధితురాలు కూల్‌డ్రింక్‌ తాగింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమె పలు మార్లు కారులోనే అత్యాచారానికి ఒడిగట్టారు. కొంత సమయం తర్వాత ఆమెకు తిరిగి స్పృహ రావడంతో తాను ఉంటున్న హాస్టల్‌లో దగ్గరే వదిలేసి పరారయ్యారు.

తనపై జరిగిన లైంగిక దాడిపై యువతి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తొలు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తర్వాత కేసును మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టిన సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. అయితే కొసమెరుపు ఏంటంటే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తామోదో గొప్ప పనిచేశామని మీడియా ఎదుట నవ్వుకుంటూ దర్జాగా కోర్టు వెళ్తుండడం చూసి.. మీడియా ప్రతినిధులు, స్థానికులు ఒకింత ఆశ్చర్యపోయారు.

Eha Tv

Eha Tv

Next Story