సోషల్‌ మీడియాలో పొలిటికల్ పార్టీల మధ్య పోటాపోటీ పెరిగింది. సెటైర్లు, విరుపులు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ను అయితే సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో పొలిటికల్ పార్టీల మధ్య పోటాపోటీ పెరిగింది. సెటైర్లు, విరుపులు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ను అయితే సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నాయి. ఆయన ఏం చేసినా ఏదో రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డిని నిత్యానంద స్వామి(Nithyananda Swamy)తో పోలుస్తూ ట్రోలర్లు రెచ్చిపోతున్నారు. ఆదివారంరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో

తెలంగాణ(Telangana) - ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) క్షత్రియ సేవా సమితి(KSHATRIYA SEVA SAMITHI)నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. సమితి వారు సీఎంను సత్కరించారు. ఓ సింహాసనంలో కూర్చొపెట్టారు. రేవంత్‌ అందులో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చారు. ఆయన తలపాగా పెట్టకుని అచ్చంగా నిత్యానందస్వామిలాగే ఉన్నారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. వెంటనే ట్రోల్స్‌ మొదలయ్యాయి. X(Twitter) లోని @ArachakaHastham అకౌంట్‌లో లేటెస్ట్‌గా ఓ వీడియో ట్వీట్ చేశారు. “నిత్యానంద భక్తులకు శుభవార్త. మిమ్మల్ని మైమరిపించడానికి మరో రూపంలో ప్రత్యక్షమయ్యాడు మీ నిత్యానంద” అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు.






Updated On 19 Aug 2024 10:51 AM GMT
ehatv

ehatv

Next Story