ఓ యువకుడు బీఫార్మసీ (B farmacy) చదువుకున్నాడు. ఓ హత్యాయత్నం కేసులో గద్వాల (Gadwala) పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలులో ఓ దొంగ పరిచమయ్యాడు. జైలు నుంచి విడుదల తర్వాత మద్యం (Alchohal), గంజాయి (Ganja) వంటి అలవాట్లకు బానిసకావడంతో డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి విలువైన వస్తువులు విక్రయించడం లేదా తాకట్టు పెట్టి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అంతేకాదు మగవారితో సంబంధాలు పెట్టుకున్నాడు.
ఓ యువకుడు బీఫార్మసీ (B farmacy) చదువుకున్నాడు. ఓ హత్యాయత్నం కేసులో గద్వాల (Gadwala) పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలులో ఓ దొంగ పరిచమయ్యాడు. జైలు నుంచి విడుదల తర్వాత మద్యం (Alchohal), గంజాయి (Ganja) వంటి అలవాట్లకు బానిసకావడంతో డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి విలువైన వస్తువులు విక్రయించడం లేదా తాకట్టు పెట్టి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అంతేకాదు మగవారితో సంబంధాలు పెట్టుకున్నాడు. వారి సంతోషం కోసం ఎంతకైనా తెగించేవాడు. తనతో చనువుగా ఉన్న మగవారికి డబ్బు అవసరమైతే నిమిషాల్లో చోరీలకు పాల్పడి డబ్బు సమకూర్చేవాడు. పెద్ద హోటళ్లు (Hotels), లాడ్జీల్లో (Lodges) బస చేస్తూ ఖరీదైన డ్రెస్సులు, చెప్పులు కొంటూ ఎంజాయ్ చేసేవాడు. ఎక్కడా స్థిరంగా ఉండకుండా తప్పించుకొని తిరుగుతుండేవాడు. తాజాగా ఓ కేసులో ఓయూ పోలీసులుకు పట్టుబడ్డాడు. దొంగతనాల్లో ఇతని వ్యవహారశైలి చూసి ఆశ్చర్యపోవడం పోలీసులవంతైంది. వివరాల్లోకి వెళ్తే...
నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లా తూముకుంట (Thumukunta) గ్రామం నాగర్లబండ తండా వాసి రత్లావత్ శంకర్‌నాయక్ (28) (Rathlawath Shankar Nayak) అలియాస్ రాజేశ్‌రెడ్డి అలియాస్ రంగారావు అలియాస్ ఇలియాజ్ ఖాన్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో 2012లో బీ ఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. అయితే చోరీ సమయాల్లో కొత్త పంథాను ఎంచుకున్నాడు. ఓ సారి అతడు చోరీ చేసిన నగలు 100 గ్రాములే అయితే.. 200 గ్రాములు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులకు దొరికినప్పుడు తాను నిజం చెప్పినా పోలీసులు నమ్మలేదు. దీంతో అప్పటి నుంచి దొంగతనాలకు పాల్పడ్డప్పడు లెక్కా పత్రం రాసిపెట్టేవాడు. ఏమేం చోరీ చేశాడో రాసి ఆ ఇంట్లో పెట్టాడు. అంతేకాకుండా తన డైరీలో (Dairy) కూడా వాటి వివరాలు రాసుకునేవాడు. ఈ లెక్కలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. పగటిపూట కాలనీల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసేవాడు. రాత్రివేళల్లో తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు, అందినకాడికి దోచుకొని వెళ్లేవాడు.
2022లో ఈ కేటుగాడిపై మేడిపల్లి పోలీసులు పీడీయాక్ట్ (PD Act) నమోదు చేశారు. అప్పటికే అతనిపై 94 కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ అదేబాట పట్టేవాడు. ఓయూ పీఎస్ పరిధిలో 3, కాచిగూడ, ఉప్పల్, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, సంగారెడ్డి పీఎస్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి.. చోరీ కేసుల్లో సెంచరీ కొట్టేశాడు. తాజాగా నిందితుడు శంకర్‌నాయక్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతి వద్ద నుంచి రూ.13.50 లక్షల విలువైన బంగారం (Gold), బైక్ (Bike), మూడు సెల్‌ఫోన్లు (Mobiles) స్వాధీనం చేసుకున్నారు. బంగారంపై రుణాలిచ్చే పలు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రశీదులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకే సవాల్‌గా మారిన ఈ కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.