కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సూర్యదే వ్ (Suryadev)అనే యువకుడు.. లాల్ దేవీ(Lal devi), జల్కర్ దేవీ(jalkar devi)లను ప్రేమించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా సూర్యదేవ్ ను మనసారా ప్రేమించారు. ముగ్గురు కలిసి ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని కూడా వాళ్లు ముందే మాట్లాడు కున్నారు.ఈ క్రమంలో మొదట పెద్ద వాళ్లు అంగీకరించకున్నా.. ఆ తర్వాత వీళ్ల ప్రేమను చూసి, అర్థం చేసుకుంటామన్న మాటల్ని విని పెద్దలు వీళ్ల పెళ్లిళ్లకు అంగీకరించారు. ఈ క్రమంలో యువకుడు.. ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లిని చేసుకున్నాడు. లాల్‌దేవీ, జల్కర్ దేవీలతో పెళ్లి పత్రిక కూడా కొట్టించాడు. అంతే కాకుండా అందరి ముందు.. పెళ్లిమండపంలో.. ఇద్దరమ్మాయిలతో పెళ్లివేడుక గ్రాండ్‌గా జరిగింది. వీళ్ల పెళ్లికి గ్రామస్థులంతా తరలివచ్చారు. అందరి ముందు సప్తపది ఏడడుగులు వేసి.. మూడు మూళ్లు ఇద్దరి మెడలో వేర్వేరుగా కట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక పెళ్లికే నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఒకేసారి రెండు పెళ్లిళ్లుచేసుకున్నావ్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
