పదే పదే దొంగతనాలు చేస్తూ నిద్రపట్టకుండా చేస్తున్న ఓ దొంగ(Thief)ను స్థానికులు పకడ్బందీగా ప్లాన్ వేసి పట్టుకున్నారు.
పదే పదే దొంగతనాలు చేస్తూ నిద్రపట్టకుండా చేస్తున్న ఓ దొంగ(Thief)ను స్థానికులు పకడ్బందీగా ప్లాన్ వేసి పట్టుకున్నారు. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడదని ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ చోరుడుని స్టేషన్‌లో పెట్టారు. కాసేపయ్యాక పోలీసుల కళ్లు కప్పి ఆ దొంగ స్టేషన్ నుంచి పారిపోయాడు. పోలీసులు షాకయ్యారు. కాలనీ ప్రజలకు ఏం జవాబు చెప్పాలోనని హడలిపోయారు. వెంటనే తలోదిక్కు వెళ్లి వెతికారు. వారి అదృష్టం బాగుండబట్టి అతడు దొరికాడు. స్టేషన్‌కు తీసుకొచ్చి ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ ఆ దొంగగారు పోలీసులను ఏమార్చి పరారయ్యాడు. ఇలా రెండుసార్లు పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకున్నాడంటే అతడు మామూలు దొంగ అయి ఉండడు.
హైదరాబాద్(Hyderabad)యూసుఫ్‌గూడ(Yousfguda)సమీపంలోని యాదగిరినగర్(Yadagirinagar)లో ఇటీవలి కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని సీసీటీవీ(CCTV)కెమెరా ఫుటేజీని పరిశీలించారు. నల్లాలను ఎత్తుకెళుతున్న దొంగను పసికట్టారు. ఈ వీడియోలను బస్తీ కమిటీ నేతలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన దొంగను స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. పట్టుబడిన దొంగను నేపాల్(Nepal)కు చెందిన వికాస్(Vikas)గా గుర్తించారు. అయితే అదే రోజు స్టేషన్ నుంచి దొంగ పరారయ్యాడు. శుక్రవారం జూబ్లీహిల్స్(Jubliees)ప్రాంతంలో దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం పోలీసులకు మళ్లీ టోక్రా కొట్టి పారిపోయాడు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలాగండి అంటూ పోలీసులపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులే ఆ దొంగను విడిచిపెడుతున్నాడా అని అనుమానిస్తున్నారు.