మేడ్చల్(Medchal)జిల్లాలో దొంగతనానికి వెళ్లి యజమాని చేతికి చిక్కాడు ఓ దొంగ‌. చెంగిచెర్ల(Chengicherla)లో ఉన్న ఒక ఇంట్లోకి చొరబడ్డ దొంగను య‌జ‌మాని పట్టుకోవ‌డంతో స్థానికులు చితకబాదారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్ల క్రాంతి కాలనీలో తెల్లవారుజామున ఓ యువకుడు గేటు దూకి ఇంటి లోపలికి ప్రవేశించాడు. ఇంటి య‌జ‌మాని అలికిడి గ‌మ‌నించి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. యువకుడు ఇంట్లోకి చొరబడటం గుర్తించాడు.

వెంటనే అప్రమత్తమైన ఆ ఇంటి యజమాని చాకచక్యంగా వ్యవహరించి దొంగతనానికి వచ్చిన యువకుడిని పట్టుకున్నారు. ఈ తతంగం మొత్తం ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల‌లో రికార్డు అయ్యింది. య‌జ‌మాని స్థానికుల‌కు స‌మాచారం అందించ‌డంతో యువకుడికి దేహ శుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. గత కొన్ని నెలలుగా చెంగిచెర్లలోని పలు కాలనీల‌లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు.

Updated On 7 July 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story