ఆడపిల్లలను మహాలక్ష్మిగా భావిస్తాం. ఆడపిల్ల పుడితే ఇంటికి దీపకాంతులు వచ్చాయని సంబరపడతాం. కానీ కొందరు తల్లులు మాత్రం మానవత్వానికి మచ్చి తెస్తున్నారు. పుట్టిన పసికందును వదిలేసుకుంటున్నారు.
ఆడపిల్లలను మహాలక్ష్మిగా భావిస్తాం. ఆడపిల్ల పుడితే ఇంటికి దీపకాంతులు వచ్చాయని సంబరపడతాం. కానీ కొందరు తల్లులు మాత్రం మానవత్వానికి మచ్చి తెస్తున్నారు. పుట్టిన పసికందును వదిలేసుకుంటున్నారు. చెత్త కుప్పల్లోనో, మురుగు కాల్వల్లోనో పారేస్తున్నారు. మంచిర్యాల(Manchiryala) జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌లో(Keslapur) ఇలాంటి విషాదకరమైన సంఘటనే చోటు చేసుకుంది. కేస్లాపూర్‌కు చెందిన గంగక్కకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లి కూడా చేసింది. రెండో కూతురు పెళ్లీడుకు వచ్చింది. అయినా కొడుకు కోసం మళ్లీ గర్భం(Pregnancy) దాల్చింది. బుధవారం రాత్రి ఆమె ప్రసవించింది. మూడో కానుపులోనూ ఆడబిడ్డ(Baby Girl) పుట్టడంతో ఆవేదనకు గురయ్యింది. పుట్టిన శిశువును గ్రామ శివారులోని చేలల్లో పడేసింది. ఆ శిశువు మృతదేహాన్ని కుక్కలు గ్రామం దగ్గరకు లాక్కొని రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లయిన కూతురు ఉండగా మళ్లీ గర్భం దాల్చడం అవమానకరంగా భావించిందో, లేక ఆడపిల్ల పుట్టిందని ఈ పని చేసిందో తెలియదు. పోలీసులు గంగక్కను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.