రాజేంద్రనగర్‌లో(Rajendranagar) డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఆన్‌లైన్‌గేములకు(Online Games) అలవాటు పడింది. తమ కూతురు చక్కగా చదువుకోవాలని ఆమెకు ల్యాప్‌టాప్(Laptop), మొబైల్ ఫోన్(Mobile) కొనిచ్చారు. చేతికందిన సాంకేతికను ఆమె చదువుకు ఉపయోగించుకోకుండా మరో వైపు తీసుకెళ్లింది. ఆన్‌లైన్‌లో గేములకు బానిసై అప్పులపాలైంది. ఆన్‌లైన్ గేములు ఆడి నష్టాలు రావడంతో భారీగా అప్పుల్లో కూరుకుపోయింది.
రాజేంద్రనగర్‌లో(Rajendra nagar) డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఆన్‌లైన్‌గేములకు(Online Games) అలవాటు పడింది. తమ కూతురు చక్కగా చదువుకోవాలని ఆమెకు ల్యాప్‌టాప్(Laptop), మొబైల్ ఫోన్(Mobile) కొనిచ్చారు. చేతికందిన సాంకేతికను ఆమె చదువుకు ఉపయోగించుకోకుండా మరో వైపు తీసుకెళ్లింది. ఆన్‌లైన్‌లో గేములకు బానిసై అప్పులపాలైంది. ఆన్‌లైన్ గేములు ఆడి నష్టాలు రావడంతో భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఏంచేయాలో తెలియక, ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని భావించిన యువతి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని దొంగిలించాలని ప్లాన్(Fake robbery) వేసింది. తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పెద్ద స్కెచ్చే వేసింది. తల్లిదండ్రులు బయటికి వెళ్లగానే బీరువాలో దాచుకున్న నగదు మొత్తాన్ని తీసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా బీరువాలో ఉన్న బట్టలను చెల్లాచెదురుగా పడేసింది. తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని తాను స్నానం చేసి వచ్చేసరికి ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేశారని తల్లిదండ్రులను నమ్మించింది. కూతురు చెప్పిన మాటలను నమ్మిన తల్లిదండ్రులు స్థానిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇంటికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. చుట్టుపక్కలవారిని విచారించారు. ఏ కోణంలో చూసినా దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు కనపడలేదు.
దీంతో ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. యువతిని పలుకోణాల్లో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తానే ఇంట్లో ఉన్న డబ్బులు నగదు అపహరించినట్లు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. యువతి స్టేట్మెంట్తో ఒకసారిగా పోలీసులతో పాటు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పోలీసులు ఆమెకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.