ఓ కూతురు కన్న తండ్రిని అతి దారుణంగా హత్య(Murder) చేసింది. ఈ ఘటన అంబర్ పేటలో(Amber Peta) చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. అంబర్ పేట్‌లో నివాసం ఉంటున్న జగదీశ్వర్(Jagadeeshwar) అనే వ్యక్తికి నిఖిత(Nikitha) అనే కూతురు ఉంది. నిఖీత అఫ్జల్‌గంజ్‌లోని ఓ దుకాణంలో పని చేస్తుంది.
ఓ కూతురు కన్న తండ్రిని అతి దారుణంగా హత్య(Murder) చేసింది. ఈ ఘటన అంబర్ పేటలో(Amber Peta) చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. అంబర్ పేట్‌లో నివాసం ఉంటున్న జగదీశ్వర్(Jagadeeshwar) అనే వ్యక్తికి నిఖిత(Nikitha) అనే కూతురు ఉంది. నిఖీత అఫ్జల్‌గంజ్‌లోని ఓ దుకాణంలో పని చేస్తుంది. ఈ క్రమంలోనే నిఖిత ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండేది. ఈ విషయమై తండ్రి.. కూతురు నిఖితను మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన నిఖిత... తండ్రిపై దాడి చేసి గాజు పెంకుతో గొంతు కోసింది. తండ్రి జగదీశ్వర్ గట్టిగ అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా.. గొంతు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అవుతుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు జగదీశ్వర్‌ను ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిఖితను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.