ఓ యువకుడు కులాంతర యువతిని ప్రేమించాడు(Love)
ఓ యువకుడు కులాంతర యువతిని ప్రేమించాడు(Love). దీంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ యువకుడిని కులం పేరుతో దూషించారు. అంతేకాదు అందరిముందు చితకబాదారు. దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేక ఉరివేసుకొని(Hang) బలవన్మరణం(Force suicide) చెందాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాలో కాదు ఇది జరిగింది. నాగరికతకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్ నగరం నడి ఒడ్డున ఈ కులవివక్ష మరణం చోటు చేసుకుంది. 'కులం తక్కువ నా కొడుకా.. మా చెల్లులు కావాలారా నీకు.. మరోసారి మా చెల్లివైపు చూస్తే నీ అంతు చూస్తామని బెదిరించడం.. ఆ యువకుడికి ఇంటికి వెళ్లి కర్రలు.. రాళ్లతో దాడి చేసి అవమానాలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
కూకట్‌పల్లి(Kukatpally) మహంకాళీనగర్‌కు చెందిన చిన్నా, మరియమ్మకు ముగ్గురు పిల్లలు. ఇందులో పెద్ద కొడుకు సునీల్ డిగ్రీ వరకు చదివాడు. అయితే వీరి ఇంటికి సమీపంలోనే ఉన్న 21 ఏళ్ల యువతిని మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కాలేజీలో చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో పలుమార్లు సునీల్‌ను హెచ్చరించారు. పలుసార్లు పెద్దవారి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయినా వీరి ప్రేమ వ్యవహారం ఆగలేదు. అయితే శుక్రవారం రోజు ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. నిజాంపేటలోని ఓ మద్యంషాపులో సునీల్ మద్యం సేవిస్తుండగా యువతి సోదరుడు, అతని బంధువు, మరికొంత మంది వచ్చి అతనిపై బీరు సీసాతో దాడి చేశారు. దీంతో సునీల్ తలకు గాయమైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. చికిత్స తర్వాత సునీల్ ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి సమయంలో యువతిని వెంటపెట్టుకొని వచ్చిన సోదరులు, తల్లి సునీల్ కుటుంబంతో మరోసారి గొడవకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. చుట్టుపక్కల వారు వచ్చి ఇరువురిని సముదాయించి పంపిచారు.
ఈ ఘటనతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. యువతి కుటుంబం వచ్చి కులం పేరుతో దూషించి దాడి చేశారని సునీల్ కుటుంబం ఫిర్యాదు చేయగా.. సునిలే తనను వేధిస్తున్నాడని యువతి, ఆమె కుటుంబసభ్యులు కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తనను, తన కుటుంబాన్ని అవమానించారని సునిల్ ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు యువతి, ఆమె కుటుంబసభ్యులే కారణమని వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. యువతితో పాటు, ఆమె తల్లి, సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.