తెలంగాణ(Telangana)లో పోలింగ్ మొదలైంది. తొలి ఓటు కూడా నమోదైంది. ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ(Annapurna Chunduri) అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వారం రోజుల ముందే ఓటు నమోదు కావడమేంటనే కదా మీ డౌట్!. తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది.

తెలంగాణ(Telangana)లో పోలింగ్ మొదలైంది. తొలి ఓటు కూడా నమోదైంది. ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ(Annapurna Chunduri) అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వారం రోజుల ముందే ఓటు నమోదు కావడమేంటనే కదా మీ డౌట్!. తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. అప్పుడే తొలి ఓటు నమోదు కావడం ఏమిటని సహజంగా అందరికీ వచ్చే సందేహమే..కానీ ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఈ సౌకర్యం కల్పిస్తోంది. అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులతోపాటు 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు.. దీనిద్వారా పోలింగ్ తేదీ కంటే ముందే ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల అధికారులు, పోలీసుల సహాయంతో ఓటరు ఇంటికే పోస్టల్ బ్యాలెట్ తీసుకువెళ్లి ఇస్తారు. ఓటరు తనకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటు వేసే సౌకర్యాన్ని అదే ఇంట్లో కల్పిస్తారు. ఓటువేశాక దాన్ని ఒక కవర్‎లో పెట్టి, ఎన్నికల అధికారికి ఓటరు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు.

మొత్తానికి వారం రోజుల ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ సదుపాయం ఈనెల 27వరకూ కొనసాగుతుంది. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే వ్యక్తులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజులలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అలాంటివారు మాత్రమే ఇలాంటి సౌకర్యం పొందే అవకాశం ఉంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 91 ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా పోలైన పోస్టల్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిశాక, అన్ని ఓట్లతో కలిపి లెక్కిస్తారు.

Updated On 22 Nov 2023 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story