తెలంగాణలో ర్యాగింగ్(Raging) కలకలం రేపుతోంది. కాకతీయ యూనివర్సిటీలో(Kakatiya Raging) ర్యాగింగ్ రక్కసి కలవరపెడుతోంది. కాకతీయ వర్సిటీలో జూనియర్లపై సీనియర్లైన అమ్మాయిలే ర్యాగింగ్‌కు పాల్పడి 81 మంది సస్పెండ్‌(Suspend) కావడం గమనార్హం. జూనియర్లను వేధిస్తున్నారని 28 మంది పీజీ విద్యార్థినులు, 28 మంది కామర్స్‌ విద్యార్థినులు, 25 మంది జువాలజీ విద్యార్థినులను వారం పాటు తరగతులకు రాకుండా సస్పెండ్‌ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.

గత కొంతకాలంగా ర్యాగింగ్‌ వార్తలు రావడంతో.. అధికారులు సీనియర్లను ఒకటి, రెండు హెచ్చరించినా ఫలితం లేదు. ఇంట్రడ్యూసింగ్‌(Introducing) పేరుతో జూనియర్లను టార్గెట్ చేస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని.. తమతో చేయలేని పనులు చేయించుకుంటున్నారని సీనియర్లపై ఉన్నతాధికారులకు జూనియర్లు ఫిర్యాదు చేశారు. తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. కేయూలోని మహిళా హాస్టల్‌లో ఉంటున్న జూనియర్‌ విద్యార్థినులను పీజీ, కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ చదువుతున్న సీనియర్లు వేధిస్తున్నారని తెలిపారు. దీంతో గత వారం, పది రోజులుగా అధికారులు నిఘా ఉంచారు. జూనియర్లపై ర్యాగింగ్‌ నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత 81 మంది విద్యార్థినుల సస్పెండ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇంత పెద్దమొత్తంలో విద్యార్థినులను సస్పెండ్ చేయడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు. మరోవైపు జూనియర్ల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమేయాలని.. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేయాలని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated On 23 Dec 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story