హైదరాబాద్‌లో వీధి కుక్కలు భీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. ఇటీవ‌ల‌ వీధి కుక్కల దాడిలో కొందరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా..

హైదరాబాద్‌లో వీధి కుక్కలు భీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. ఇటీవ‌ల‌ వీధి కుక్కల దాడిలో కొందరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారు పటాన్ చెరు పరిసర ప్రాంతంలో వీధి కుక్క‌ల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

బీహార్‌కు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పటాన్ చెరు ఇస్నాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్ర‌వారం ఉదయం ఇంట్లో నుంచి విశాల్ (8) అనే బాలుడు కాలకృత్యాల కోసం బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డాయి. కుక్కలు దాడి చేసే స‌మ‌యంలో బాలుడు గట్టిగా కేక‌లు వేసినా ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు వ‌దిలాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు చూసి బాలుడి తల్లిదండ్రులకు స‌మాచార‌మిచ్చారు. దీంతో కుక్కల దాడిలో తీవ్ర గాయాలై మృతి చెందిన కొడుకును చూసి ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు స్పందిస్తూ.. వీధి కుక్క‌ల స్వైర‌విహారంపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు.

Eha Tv

Eha Tv

Next Story