సీడబ్ల్యుసీ(CWC) భేటీలకు వచ్చే నేతలకు హైదరాబాద్(Hyderabad) అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించబోతున్నది. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని(Hyderabadi dum biryani) వారికి వడ్డించబోతున్నది. మొత్తం 78 రకాల వంటకాలను వడ్డించడానికి పీసీసీ(PCC) సకల ఏర్పాట్లు చేసింది. ఉదయం టిఫిన్ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల వంటలు వండుతున్నారు.
సీడబ్ల్యుసీ(CWC) భేటీలకు వచ్చే నేతలకు హైదరాబాద్(Hyderabad) అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించబోతున్నది. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని(Hyderabadi dum biryani) వారికి వడ్డించబోతున్నది. మొత్తం 78 రకాల వంటకాలను వడ్డించడానికి పీసీసీ(PCC) సకల ఏర్పాట్లు చేసింది. ఉదయం టిఫిన్ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల వంటలు వండుతున్నారు. అదిరిపోయే రుచితో మెనూ రెడీ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో(Mallikarjuna Kharge) పాటు సోనియాగాంధీ(Sonia Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వంటి సీనియర్ నేతలు , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి పాకశాస్త్ర యోధులను రప్పించింది. అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్లు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంకటి, పాయ సూప్, ఖీమా రోటి, మిల్లెట్ ఉప్మ, మిల్లెట్ వడ, ఫ్రూట్ సలాడ్ వడ్డించబోతున్నారు. మధ్యాహ్నం భోజనంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కూర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింత చిగురు మటన్, గోంగూర మటన్, చేపల కూర ఉన్నాయి. వెజిటేరియన్ల కోసం పచ్చి పులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి దాల్చా, రోటి పచ్చళ్లు ఉన్నాయి. మధ్య మధ్యలో ఇరానీ చాయ్ ఎలాగూ ఉంటుంది. చాయ్‌తో పాటు ఇక్కడి ప్రత్యేకమైన ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, సమోసాలు, కుడుములు, మురుకులు, బాయిల్డ్ మొక్కజొన్న, సకినాలు, గారెలు అతిథులకు అందించనున్నారు.