రేవంత్ ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించింది.. మొదటి ఆరు మాసాలు చాలా కీలకం.. ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆరు నెలలు ముఖ్యమైనవి.. రేవంత్ రెడ్డి ఈ ఆరునెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

రేవంత్(Revanth Reddy) ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించింది.. మొదటి ఆరు మాసాలు చాలా కీలకం.. ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆరు నెలలు ముఖ్యమైనవి.. రేవంత్ రెడ్డి ఈ ఆరునెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నేటి కేబినెట్ సమావేశం లో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నామ‌న్నారు. రైతు బంధు దేశంలోనే మొదటి సారి అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. పీఎం సహా అనేక రాష్ట్రాల సీఎంలు రైతు బంధును ప్రశంసించారు.. ఇదే అనేక రైతు పెట్టుబడి సాయం పథకాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రైతుబంధు అనేది కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అని అన్నారు.

రోహిణీ కార్తె లో తొలకరి జల్లులు వస్తాయి. సగటు రైతు పెట్టుబడి కోసం రోహిణి కార్తెలో పిల్లి కూనల‌ తిరుగుతూ ఉంటారు. రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చారు. దున్నెప్పుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనంగా ఉంటుంది. రేవంత్ యాసంగి రైతు బంధు పంటలు కోసే సమయానికి ఇచ్చారు. ఈ సారి అలాంటి తప్పు చేయకుండా రైతు భరోసాను రోహిణి కార్తెలో విడుదల చేసేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలన్నారు.

జూన్ మొదటి వారంలోనే రైతులకు ఎకరాకు 7,500 రూపాయలు విడుదల చేయాలన్నారు.. ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వర్షా కాలంలోనే ఎక్కువగా సన్న రకాల ధాన్యం పండిస్తారని.. రబీలో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరు.. క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేన‌న్నారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందేన‌న్నారు. తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడంపై కేబినెట్ మీటింగ్ లో చర్చించాలన్నారు. బోనస్ ను బోగస్ గా మార్చకండి.. రేవంత్ కు ఇదే కీలకమైన కేబినెట్ సమావేశం ..మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు సన్న వడ్లకే బోనస్ అని సీఎం అంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేన‌న్నారు.

Updated On 18 May 2024 8:35 AM GMT
Yagnik

Yagnik

Next Story