హైదరాబాద్‌లోని బాచుపల్లిలో(Bachupally) విషాదం చోటు చేసుకుంది. రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు(Labours). రేణుకా ఎల్లమ్మ కాలనీలో హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండీఏ అనుమతితో సెల్లార్, స్టిల్ట్ +5 అప్పర్ ఫ్లోర్లతో రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నది.
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో(Bachupally) విషాదం చోటు చేసుకుంది. రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు(Labours). రేణుకా ఎల్లమ్మ కాలనీలో హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండీఏ అనుమతితో సెల్లార్, స్టిల్ట్ +5 అప్పర్ ఫ్లోర్లతో రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నది. ఈ భవంతి నిర్మాణంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే కార్మికులు రేకుల షెడ్స్ వేసుకుని జీవిస్తున్నారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటెయినింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్స్ పై కూలింది. భారీ వర్షంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ షెడ్స్ నుంచి బయటికి పరుగులు తీశారు. ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.