చిన్నారికి మత్తు మందు(anesthesia) ఇచ్చారు. కాసేపటికే ఆ చిన్నారి గుండె ఆగిపోయినట్లు గుర్తించారు.

ఓ చిన్నారికి నలక పడిందని ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది(Hospital staf) సమస్యకు సర్జరీ(surgery) పరిష్కారమంటూ ఈ చిన్నారికి మత్తు మందు(anesthesia) ఇచ్చారు. కాసేపటికే ఆ చిన్నారి గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. నలక సమస్యతో వస్తే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని ఆస్పత్రి వైద్యులపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తార్నాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి అన్విక(Anvika) (5) కంటిలో నలక సమస్యతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు ఆనంద్‌ ఐ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా చిన్నారికి ఎనస్తీషియా ఇచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ ఎనస్తీషియా ఇచ్చిన కాసేపటికే ఆ చిట్టి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ వైద్యులు పాప తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్‌ బో(Rainbow Hospital) చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి అన్వికను తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు పాప స్పృహలో లేదని, మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తమ బిడ్డను హాస్పిటల్ వాళ్లే చంపేశారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Eha Tv

Eha Tv

Next Story