రానురాను మానవుడి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆహరం, జీవనశైలి కారణంగా మన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది.

రానురాను మానవుడి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆహరం, జీవనశైలి కారణంగా మన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా కానీ కొన్నింటిని అవి అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా ఐదేళ్ల బాలికకు గుండెపోటు రావడంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. కరీంనగర్ జిల్లా(Karimnaragr District) జమ్మికుంట(Jammikunta)కు చెందిన రాజు - జమున(Raju Jamuna)ల కుమార్తె ఉక్కులు(Ukkulu) (5) నిన్న ఉదయం కళ్లు తిరిగి కిందపడింది. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా హన్మకొండ(Hanumakonda)కు రిఫర్ చేశారు. హన్మకొండలో వైద్యులు పరీక్షిస్తుండగా ఉక్కులు చనిపోయింది. అయితే చిన్నారికి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు తెలిపారు.

ehatv

ehatv

Next Story