చనిపోయాడనుకుంటే లేచి కూర్చున్న ఘటన హనుమకొండలో(Hanumakonda) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గంటల కొద్దీ నీటిలో తేలుతూ(Floating in water) ఉండటంతో చూసినవాళ్లు పాపం చనిపోయాడనుకున్నారు. వెంటనే 108కు ఫోన్ చేశారు. వారు కూడా ఆగమేఘాల మీద వచ్చారు. నీటిలో తేలుతున్నది శవమే(Dead body) అనుకుని బయటకు తీయడానికి ప్రయత్నించారు.

Hanumakonda
చనిపోయాడనుకుంటే లేచి కూర్చున్న ఘటన హనుమకొండలో(Hanumakonda) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గంటల కొద్దీ నీటిలో తేలుతూ(Floating in water) ఉండటంతో చూసినవాళ్లు పాపం చనిపోయాడనుకున్నారు. వెంటనే 108కు ఫోన్ చేశారు. వారు కూడా ఆగమేఘాల మీద వచ్చారు. నీటిలో తేలుతున్నది శవమే(Dead body) అనుకుని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అతడు చక్కగా లేచి నడిచిరావడంతో అందరూ బిత్తరపోయారు.
కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధి రెడ్డిపురంలోని కోవెలకుంటలో దాదాపు 46 ఏళ్ల వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలో తేలియాడుతూ ఉండటంతో స్థానికులు అతడు చనిపోయి ఉంటాడని అనుకున్నారు.
వెంటనే కేయూసీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. అకడికి చేరుకున్న పోలీ సులు బయటకు తీసే క్రమంలో అతడు లేచాడు. 'చల్లగా ఉందని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. నేను చావలేదు. సుబ్బరంగా బతికే ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. అతడి పేరు శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి అతడి స్వగ్రామం. కాజీపేట దగ్గరలోని ఓ గ్రానైట్ కంపెనీలో పని చేయడానికి వచ్చాడు. పది రోజులుగా వేడి వాతావరణంలో పని చేస్తున్నానని, చల్లదనం కోసమే ఇక్కడికి వచ్చి చెరువులో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని అన్నాడు. ఓ 50 రూపాయలు ఇస్తే కాజీపేటకు వెళ్లిపోతానంటూ బతిమాలుకున్నాడు.
