కొద్ది రోజులుగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో కేటీఆర్‌పై కేసు పెడతారని చర్చ జరుగుతూనే ఉంది.

కొద్ది రోజులుగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో కేటీఆర్‌పై కేసు పెడతారని చర్చ జరుగుతూనే ఉంది. అయితే అంత అనుకుంటున్నట్టుగానే ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను A 1 గా చేస్తూ కేసును నమోదు చేశారు. ఈ కేసులో A 2 గా ఐ.ఏ.ఎస్. అరవింద కుమార్ , A ౩ గా బి.ఎల్.ఎన్. రెడ్డి పేర్లను నమోదు చేశారు.
13 (1 ) A, 13 (2 ) పి.సి., 409 , 120 B సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారు.ఈ నాలుగు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావడం గమనార్హం. ఆర్.బి.ఐ. మార్గదర్శకాలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని, దీనికి సంబంధించి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల ఫైన్ కట్టారని, దీని ఆధారంగానే కేసు నమోదు చేశారని ఏ.సి.బి. చెప్పింది. కేబినెట్ ఆమోదం లేకుండా ఈ నిర్ణయం కె.టి.ఆర్. తీసుకున్నట్టు తెలుస్తుంది. అధికార దుర్వినియోగం చేశారని ఏ.సి.బి. ఆరోపించింది.
ఏదో ఒక సమయంలో తనను అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కూడా బహిరంగంగానే చెబుతూ వచ్చాడు. అయితే అక్రమ కేసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని కూడా చెబుతూ వచ్చారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని బి.ఆర్.ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. అసెంబ్లీ లో ఈ విషయం పై చర్చ పెట్టాలని బి.ఆర్.ఎస్. పార్టీ డిమాండ్ చేసింది.
