తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ప్రమాణం చేశారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కొన్ని జిల్లాల నుంచి ఇద్దరేసి మంత్రులుంటే, మరికొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కడ పోవడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka),

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ప్రమాణం చేశారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కొన్ని జిల్లాల నుంచి ఇద్దరేసి మంత్రులుంటే, మరికొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కడ పోవడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)లకు క్యాబినెట్‌లో చోటు దక్కింది. ఒక్క భద్రాచలం తప్పితే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలన్నింటిలోనూ కాంగ్రెస్‌, ఆ పార్టీ బలపరిచిన వారే విజయం సాధించారు. వరంగల్‌ నుంచి సీతక్క(Seethakka), కొండా సురేఖ(Konda Surekha)లకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar), శ్రీధర్‌బాబు(Sridhar Babu)లకు, నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), మహబూబ్‌నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), మెదక్‌ నుంచి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)లకు మంత్రి పదవులు దక్కాయి. హైదరాబాద్‌(Hyderabad), రంగారెడ్డి(Rangareddy), నిజామాబాద్‌(Nizamabad), ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాల నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కుతుందేమో!

Updated On 7 Dec 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story